Renuka Chowdhury | పొంగులేటి కాంగ్రెస్‌లోకి రావడం మంచిదే: రేణుకా చౌదరి

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి(Renuka Chowdhury) స్పందించారు. పొంగులేటి కాంగ్రెస్‌లోకి రావడం మంచిదేనని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం కోసం అంతా కృషి చేయాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. బీజేపీని వ్యతిరేకించే విపక్షాలన్నీ ఏకతాటిపైకిరావడాన్ని ఆమె స్వాగతించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు జోష్ వుందని.. రాష్ట్రంలో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని రేణుకా చౌదరి జోస్యం చెప్పారు. నిన్నటి వరకు మాకు బేడీలు వేసే పోలీసులు కూడా మాకు సలాం కొడుతున్నారని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానం పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పొంగులేటి చేరికను స్వాగతించిన రేణుకా చౌదరి తన వర్గానికి మూడు టికెట్లు కేటాయించాల్సిందే అని పెద్దలతో తన మనసులోని మాటలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పని చేసే వాళ్లను గుర్తించడంతో పాటు పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలను ప్రోత్సహించాలనే విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తంగా పొంగులేటి చేరికకు ముందు రేణుకా చౌదరి(Renuka Chowdhury) హస్తినా టూర్ సంచలనంగా మారింది.

- Advertisement -
Read Also:
1. తెలంగాణపై కొన్ని పత్రికలు విషం చిమ్ముతున్నాయి: కవిత
2. కేసీఆర్‌ను బాటా చెప్పుతో కొట్టాలి.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...