కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు నమోదు చేసిందన్నారు. రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేసి ఆయనపై ఎంపీగా అనర్హత(Disqualification) వేటు వేసిందన్నారు. అనర్హత వేటు తర్వాత ఒక్క రోజులోనే ఇంటిని సైతం ఖాళీ చేయించి భారీ కుట్రకు తెరలేపిందన్నారు. దేశంలోని జాతీయ సంపదను ప్రజా ఆస్తులను ఆధానికి ధారాదత్తం చేసి అవినీతికి పాల్పడుతున్న అంశాలపై రాహుల్ గాంధీ నిలదీయడం, అదానీ అక్రమ సంపాదనలపై, హిండెన్ బర్గ్ నివేదికల ఆధారంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్న డిమాండ్ చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీపై ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి మద్దతుగా, సీఎల్పీ భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈనెల 14న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. దానిని విజయవంతం చేయాలని రేవంత్(Revanth Reddy) డిమాండ్ చేశారు.
Read Also: వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ పై రియాక్ట్ అయిన MLC కవిత
Follow us on: Google News, Koo, Twitter