Revanth Reddy |టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోన్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇది వ్యక్తుల తప్పిదం కాదని, ఇందులో పెద్ద పెద్ద వాళ్లు ఇన్వాల్స్ అయి ఉన్నారని అన్నారు. ఈ స్కామ్‌లో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి(KTR’s PA Tirupati) హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఒకే ఊరిలో వందమందికి పేపర్ లీక్ చేశాడన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ప్రతిభావంతులు, పేద అభ్యర్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఇద్దరికే సంబంధముందంటూ మంత్రి కేటీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారంటూ విమర్శించారు.
కేటీఆర్(KTR)ను బర్తరఫ్ చేయడమే కాదు చంచల్‌గూడ్ జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. నిందితులను కస్టడీకి తీసుకోకముందే రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ మాత్రమే నిందితులని కేటీఆర్ ఎలా నిర్ధారించారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిలదీశారు. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులెవరైనా ఆ సంస్థ నిబంధనల మేరకు ఆ సంస్థ నిర్వహించే పరీక్షలకు పోటీ పడేందుకు అనర్హులు. కానీ.. కేసీఆర్, కేటీఆర్ చొరవతో 20 మంది ఉద్యోగులకు ఎన్వోసీ ఇచ్చిన మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. ఒకవేళ పోటీ పరీక్ష రాయాలంటే రాజీనామా చేయాలి, లాంగ్ లీవ్‌లో వెళ్లాలి లేదా ఇతర శాఖలకు బదిలీపై వెళ్లి ఉండాలని వివరించారు.
Read Also: నిజాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జే కరెక్ట్
Follow us on: Google News Koo