ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ వ్యక్తులకు లీజు వెనుక భారీ అవినీతి జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగు రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకిస్తే దాదాపు రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తదన్నారు. అయితే ముంబైకి చెందిన ఐఆర్ బీ లిమిటెడ్ అనే సంస్థకు 7380 కోట్లకే కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. నాలుగైదు నెలల్లో దిగిపోయే కేసీఆర్కు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లీజులో దాదాపు 1000 కోట్లకుపైగా చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు. ఇది దేశంలోనే పెద్ద స్కాం అని.. దీని వెనకాల మాజీ సీఎస్ సోమేష్ కుమార్(CS Somesh Kumar), హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్(KTR)తో కలిసి ఈ దోపిడికి పాల్పడ్డారన్నారు. సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ ఇద్దరు అధికారులు తీసుకున్న నిర్ణయాలను.. లావాదేవీలపై అధికారంలోకి రాగానే కాంగ్రెస్ విచారణకు ఆదేశించి అక్రమాలకు పాల్పడిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: కొత్త సెక్రటేరియట్లో కేటీఆర్ ఫస్ట్ సంతకం ఆ ఫైల్ మీదే!
Follow us on: Google News, Koo, Twitter