Ponguleti |తెలంగాణకు విముక్తి కోసం ఏకమవుతున్నాం: రేవంత్, పొంగులేటి

-

బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti) కాంగ్రెస్ పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చేశారు. మరో మూడు రోజుల్లో పార్టీలో చేరికపై ప్రకటన చేస్తానని ప్రకటించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy), చిన్నారెడ్డి తదితర నేతలు పొంగులేటి(Ponguleti)తో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao)ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని ఈ సందర్భంగా వారు మీడియాకు తెలియజేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం అందరం ఏకమవుతున్నామన్నారు. అంతకుముందు ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో పాటు ఇతర కీలక నేతలు తమతో కలిసి రావాలని ఆహ్వానించామని రేవంత్ తెలిపారు. అధిష్టానం ఆదేశాలతోనే నేతలను కలిసి పార్టీలోకి స్వాగతిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ సారథ్యంలో కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల నుండి తెలంగాణకు విముక్తి లభించబోతోంది… అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు ఫలించే రోజు దగ్గరలోనే ఉందని రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -
Read Also:
1. వైసీపీ ఎమ్మెల్యేలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జగన్!!
2. గద్దర్ సంచలన నిర్ణయం.. ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...