‘బీజేపీ అభివృద్ధి చేస్తే.. మోడీ, షా ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది?’

-

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు. అలంద్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన బీజేపీ పై మండిపడ్డారు. పప్పు పంటలకు పేరుగాంచిన ఈ నియోజకవర్గం.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గుత్తేదారు సుభాష్ చేసే అక్రమాలకు, 40 శాతం కమిషన్ తీసుకుని ఆయన ఇంకా ప్రసిద్ధి చెందారని వ్యంగ వ్యాఖ్యానాలు చేశారు. కర్ణాటకను బీజేపీ అభివృద్ధి చేస్తే ప్రధాని మోడీ(Modi), హోమ్ మంత్రి అమిత్ షా(Amit Shah) ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీ కుట్ర చేసి మల్లికార్జున ఖర్గే ని ఓడించిందని అన్నారు. కర్ణాటక కు చెందిన మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) కి అధ్యక్షునిగా ఏఐసీసీ బాధ్యతలు అప్పగించి గౌరవించిందన్నారు. 40 శాతం కమిషన్ తీసుకునే ఈ ప్రభుత్వంతో పక్క రాష్ట్రాల్లో కర్ణాటక పరువు పోతుందని ఆరోపించారు.

- Advertisement -

ఖర్గే నాయకత్వంలో హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కర్ణాటక ప్రజలు మొత్తం ఇప్పుడు ఖర్గే తో నడవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్(Revanth Reddy) కోరారు. జరగబోయే ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసారు. అదే విధంగా తెలంగాణాలో కూడా అధికారంలోకి వస్తామని అన్నారు.

Read Also: ఇకపై ఢిల్లీ కేంద్రంగానే కేసీఆర్ రాజకీయాలు.. ముహుర్తం ఖరారు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...