Revanth Reddy files case against TRS Party Change in Delhi High Court: టీఆర్ఎస్ బీఎస్ఆర్(BRS) గా మార్పును వ్యతిరేకిస్తూ టీపిసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీ హై కోర్ట్ లో వేసిన కేసుపై నేడు వాదనలు జరిగాయి. మార్పు సమయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటె డిసెంబర్ 6 లోపు తెలపాలని కోరింది ఈసీ. ఆ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. బంగారు కూలీ పేరుతో నిధులు సమీకరణ పై గతంలో కేసు వేసినట్లు పేర్కొన్నారు. ఆ తీర్పు వచ్చేవరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చవద్దంటూ ఈసీ కి పిర్యాదు చేసారు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిటిషన్ ను పట్టించుకోకుండా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్(BRS) గా మారుస్తూ కేసీఆర్ కు ఈసీ లేఖ ఇచ్చింది. దీంతో ఢిల్లీ హై కోర్ట్ లో రేవంత్ రెడ్డి వేసిన కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏయే శాఖలపై మీకు అభ్యంతరాలు ఉన్నాయో ఆ శాఖలపై పిటిషన్లను వేసుకోవచ్చని స్వేచ్ఛను ఇచ్చింది కోర్ట్.