లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడడంతో ఎట్టకేలకు తన అధికారిక నివాసాన్ని కీలక నేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్లో ఉన్న ఆ భవనంలో రాహుల్ 2005 నుంచి ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్(CR Patil) నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. తాజాగా గడువు ముగియడంతో శనివారం తన బంగళాను రాహుల్ ఖాళీ చేశారు. అయితే, రాహుల్ గాంధీ ఇళ్లు ఖాళీ చేస్తున్న విజువల్స్ చూసి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎమోషనల్ అయ్యారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ గొప్ప కుటుంబ వారసత్వ చరిత్ర ఉండి, దేశానికి తమ వారసత్వ ఆస్తులను ధారబోసిన కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి, పార్లమెంటుకి అనర్హుడిగా చేసి, అధికార నివాసమైన ఇల్లును ఖాళీ చేయించి కట్టుబట్టలతో బయటకు పంపించిన సమయంలో చాలా హుందాగా, యువతకు ఆదర్శవంతంగా ప్రవర్తించి,ఇంటిని ఖాళీచేసి ప్రభుత్వానికి అప్పజెప్పి బయటకు వెళ్లిన తీరుతో భారతీయ ఆత్మకు మరింత చేరువయ్యాడు. ఆ దృశ్యాలను చూసినవాళ్లకు కళ్ళల్లో నీటిసుడులు తిరుగుతాయి, గుండెలు బరువెక్కుతాయి.’’ అని రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
Read Also: రాహుల్ గాంధీని ఇళ్లు ఖాళీ చేయించడం దారుణం
Follow us on: Google News, Koo, Twitter