Revanth Reddy | కేటీఆర్‌లా నేను అమెరికాలో బాత్రూంలు కడగలేదు: రేవంత్ రెడ్డి

-

బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా పుట్టలో పడుకున్న పాములు బయటకు వచ్చి తనను నిందించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి వివరించాము. వారి సందేహాలను నివృత్తి చేసాం. 24గంటల విద్యుత్ సరఫరా విషయంపై సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేసాం. కేటీఆర్(KTR), బీఆర్ఎస్(BRS) మా వీడియోను ఎడిట్ చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు.

- Advertisement -

బీఆర్ఎస్ చిల్లర ప్రయత్నంతో రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌పై చర్చకు అవకాశం వచ్చింది. వైఎస్ పాదయాత్ర చేసి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి నెరవేర్చారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన సందర్భంలో కేసీఆర్ హెచ్ఆర్డీ విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదని ఆనాడు కేసీఆర్(KCR) చెప్పారు. బషీర్ బాగ్ కాల్పుల(Basheerbagh Encounter) ఘటన సందర్భంలో కేసీఆర్ కీలక స్థానంలో ఉన్నారు. ఉచిత విద్యుత్ హామీపై తొలి సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్. ఉచిత విద్యుత్ మాత్రమే కాదు.. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్.

వ్యవసాయాన్ని పండగ చేయాలని కాంగ్రెస్ అనేక పథకాలు తీసుకొచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థల పంపిణీ విషయంలో జైపాల్ రెడ్డి(Jaipal Reddy) గారు ఎంతో చొరవ చూపారు. జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన విద్యుత్ పంపకాలు జరపాలని ఆయన సోనియాను ఒప్పించారు. అలా తెలంగాణకు 53శాతం.. ఏపీకి 47 శాతం విద్యుత్ ఇచ్చేలా ఆనాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం అంటే ఏమిటో నాకు తెలుసు.. నాగలి పట్టడం, గుంటుక కొట్టడం తెలిసిన వాడిని.. కేటీఆర్‌లా నేను అమెరికాలో బాత్రూంలు కడగలేదు.

వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న రైతు బిడ్డను నేను.. నేను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకును కాదు.. వాస్తవంగా కేసీఆర్ 24 గంటల విద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అప్పట్లో కేసీఆర్ గొప్పగా చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరతాం. సెప్టెంబర్ 17న మా మేనిఫెస్టోలో ప్రకటిస్తాం..’’ అంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...