బీఆర్ఎస్ సర్కార్ 111 జీవో రద్దు ఆదేశాల వెనక నేపథ్యం మనం గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘1908లో హైదరాబాద్‌కు వరదలు వచ్చి 50వేల ప్రాణ నష్టం జరిగింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని, వరద నివారణకు ఆనాటి నిజాం గ్లోబల్ టెండర్లు పిలిచారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యంలో మూసీ, ఈసా నదులపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను నిర్మించారు. జంట జలాశయాలను రక్షించేందుకు 1996లో 111 జీవోను ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. 84 గ్రామాలను బయో కన్సర్వేషన్ జోన్‌లో పెట్టారు. నిజాం, సమైక్య పాలకులు కూడా నగరాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 111 జీవోను అమలు చేశారు.
కేసీఆర్ ధన దాహం కోసం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 111 జీవో రద్దు హైదరాబాద్ నగరానికి అణు విస్ఫోటనం కంటే ప్రమాదం. జీవో రద్దు వెనక కుట్ర ఉంది. 80శాతం భూములు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లింది. 111జీవో రద్దు దుర్మార్గపు నిర్ణయం. కేసీఆర్‌ను కోసి కారం పెట్టినా తప్పులేదు. కాంగ్రెస్ పోరాటం ఫలితంగానే కృష్ణా, గోదావరి జలాలు తరలింపు జరిగింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను విధ్వంసం చేసే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు పైప్ లైన్ ఇస్తాననడం వెనక కుట్ర దాగుంది. విషయాన్ని ఈ విషయాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక లక్షల కోట్ల కుంభకోణం దాగుంది. బందిపోట్లను, దావూద్ నైనా క్షమించవచ్చు… కానీ కేసీఆర్, కేటీఆర్‌ను క్షమించ కూడదు. మొత్తం భూములు పేదల నుంచి కొనుగులు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారు. పర్యావరణ విధ్వంసానికి కేసీఆర్ పాల్పడుతున్నారు.
ఈ విధ్వంసం వెనుక భారీ భూ కుంభకోణం ఉంది. కాంగ్రెస్ నిజ నిర్దారణ కమిటీని నియమిస్తున్నాం. 2019 నుంచి ఇప్పటి వరకు బీఆరెస్ నేతలు కొన్న భూముల వివరాలు కమిటీ సేకరిస్తుంది. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ లావాదేవీలు బయటపెట్టాలి. బినామీ యాక్టును కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలి. బీఆర్ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తోంది. ఇది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణం. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, కేసీఆర్, కేటీఆర్ ను అమరవీరుల స్థూపం వద్ద కట్టేసి కొట్టినా తప్పు లేదు.’’ అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: పొంగుటేటి ఓ బచ్చా.. డబ్బుతో బలిసిపోయారు: పువ్వాడ
Follow us on: Google News, Koo, Twitter