Revanth Reddy House Arrest: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ల సమస్యలపై ఇవాళ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు ముందస్తు హౌస్ అరెస్టు చేశారు. ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగానే పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై వేలెత్తి చూపితే అరెస్టులు చేస్తారా అంటూ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. ఎలాగైనా ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేసి తీరుతామని ఆయన సవాల్ విసిరారు. కాగా టీ-కాంగ్రెస్ నిర్వహించాలనుకున్న ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోయినా ఆందోళన చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.