సొంత నేతపై కొండా సురేఖ సంచలన కామెంట్స్.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే!

0
Konda Surekha

Revanth Reddy Responds Over Konda Surekha comments on Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆ పార్టీ మహిళా నేత కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీభవన్ లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె.. గతంలో సమన్వయ లోపంతో జరిగిన పొరపాట్లు, కోమటిరెడ్డి వ్యవహారశైలిపై స్పందించారు. గత ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయకపోవడం వల్లే ఓడిపోయామని, ఇప్పటికైనా కాంగ్రెస్ లో అందరు కలిసి పని చేయాలని సూచించారు. అంతేకాకుండా పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఆమె వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. వ్యక్తిగత ఆరోపణలు వద్దని, కాంగ్రెస్ బలోపేతానికి సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించుకుందామని ఆమెకు సర్దిచెప్పారు.

కాగా, గత కొంతకాలంగా అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reedy) తాజాగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో వరుసగా భేటీ అవుతున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here