2036 టార్గెట్ ఫిక్స్ చేసిన రేవంత్

-

క్రీడలు, క్రీడల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ అవకాశం ఇండియా కి దక్కితే… హైదరాబాద్‌ను ప్రధాన వేదికగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా అభ్యర్థించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని సీఎం ప్రకటించారు.

- Advertisement -

ఆదివారం హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మారథాన్ హైదరాబాద్ ముగింపు వేడుకలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ మారథాన్ నిర్వాహకులను, స్పాన్సర్లను సీఎం అభినందించారు.

రాబోయే ఖేలో ఇండియా యువ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలిసి కోరిన విషయాన్ని సీఎం వివరించారు. దేశంలో ఏ క్రీడలు జరిగినా తెలంగాణలో హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించాల్సిన సందర్భాల్లో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈ దేశానికే క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్‌ నగరం ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

2028 ఒలింపిక్స్ లో అత్యధిక మెడల్స్ తెలంగాణ నుంచి సాధించాలన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించామని సీఎం తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే ఏడాది నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీకి దక్షిణ కొరియా స్పోర్ట్స్ వర్సిటీ సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని స్టేడియం లను ఒలింపిక్స్ స్థాయికి అప్ గ్రేడ్ చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్రీడా ప్రాంగణాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని ముఖ్యమంత్రి(Revanth Reddy) తెలిపారు.

Read Also: టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్.. ఎందుకంటే..?
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...