సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కావాలనే బీఆర్ఎస్, కేసీఆర్ టార్గెట్‌గా విషం చిమ్ముతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రతి విషయంలో విఫలమైందని, తమ వైఫల్యాలకు బీఆర్ఎస్ కారణంగా చెప్పుకోవడానికే ప్రతి విషయంలో తమ పార్టీ, తమ నాయకుడు కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 4 ప్రాజెక్ట్‌లు కూలిపోయాయని, ప్రాజెక్ట్‌ల నిర్వహణను ప్రభుత్వం నిర్లక్షం చేయడమే ఇందుకు ప్రధాన కారణమని ఆమె విమర్శించారు.
పైగా వారి వైఫల్యాలకు బీఆర్ఎస్(BRS), కేసీఆర్‌లను(KCR) బాధ్యులను చేసే ప్రయత్నం జరగుతుందని ఆరోపించారు. తమ చేతకాని తనాన్ని బీఆర్ఎస్‌కు అంటగట్టడానికి కాంగ్రెస్, రేవంత్ తెగ కష్టపడుతున్నారని విమర్శించారు. దృష్టి పెట్టాల్సిన అంశాలను అటకెక్కించి కేసీఆర్‌పై ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తీరు ఉందని అన్నారు.
‘‘మోదీని(PM Modi) కలిసి వచ్చిన తర్వాత బీఆర్ఎస్‌ను ఖతం చేస్తాం, లేకుండా చేస్తాం అని ప్రకటనలు చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటే రాష్ట్రానికి కట్టుబడి ఉన్న కుటుంబం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎనుముల కుటుంబం అంటే ఒక న్యాయం?, కల్వకుంట్ల కుటుంబం అంటే ఒక న్యాయమా? మిస్టరీగా మరణాలు అని చిట్ చాట్ లో మాట్లాడి అవీ పేపర్ ప్రధాన వార్తలు వస్తున్నాయి. ఈ హెడ్ లైన్ల తో, ఇలాంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్‌ఎస్‌పై దాడి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల, రాష్ట్ర హక్కులే బీఆర్‌ఎస్ ముఖ్యం’’ అని MLC Kavitha అన్నారు.