టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మంత్రి కేటీఆర్(KTR) లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ నోటీసులపై రేవంత్ రెడ్డి మరోసారి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ లీగల్ నోటీసులకు ఏడు పేజీల సమాధానం ఇచ్చారు. లీగల్ నోటీసులతోపాటు పలు అంశాలపై కౌంటర్ ఎటాక్ చేశారు. లీగల్ నోటీస్‌లు వెనక్కి తీసుకోకపోతే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని.. ఆ ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ(TSPSC) విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడానన్నారు. టీఎస్‌పీఎస్‌సీకి సాంకేతిక పరిజ్ఞానం ఐటీ శాఖేనని, అలాంటప్పుడు.. కేటీఆర్‌కు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి(Revanth Reddy). నిందితుడు రాజశేఖర్ నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందని గుర్తు చేశారు. అంతేకాదు.. దమ్ముంటే పేపర్ లీక్ కేసును సీబీఐ, ఈడీకి అప్పగించాలని సవాల్ విసిరారు రేవంత్‌రెడ్డి.
Read Also: సంచలన నిర్ణయం.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఒంటిపూట విధులు
Follow us on: Google News, Koo, Twitter