హైదరాబాద్‌లో భూములు కొన్నవారు జాగ్రత్త.. రేవంత్ రెడ్డి వార్నింగ్

-

హైదరాబాద్ మహానగరం చుట్టూ 10 వేల ఎకరాలను కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకున్నదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లో చేరిన వారికి స్వాగతం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని.. ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకోవడానికి కాదని అన్నారు. దళితుల భూములు గుంజుకోవాలని కాదని తెలిపారు.

- Advertisement -

పేదలకు కాంగ్రెస్ పట్టా భూములు ఇస్తే.. అభివృద్ధి ముసుగులో బీఆర్ఎస్ గుంజుకుంటోందని మండిపడ్డారు. రూ.100 కోట్లు పలికే భూములకు ఎకరానికి కోటి అయినా పేదలకు ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్ పక్కన 65 వేల కోట్ల విలువైన భూమి ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయని, అందుకే అన్ని ఆస్తులు అమ్ముకుని కేసీఆర్ విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని చెప్పారు. సొంత మనుషులకు అప్పగించేందుకే వైన్ షాపులకు ముందే టెండర్లు వేశారని ఆరోపించారు. నాలుగు నెలల ముందు ఎలా టెండర్లు ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ టెండర్లు వేస్తామని ప్రకటించారు.

హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్.. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని అడిగారు. భూములు కొన్నవారు జాగ్రత్త.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని హితవు పలికారు. కేసీఆర్ ఓటమి భయంతోనే అన్నీ అమ్ముకుంటున్నారని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ మా వాళ్లపై అక్రమ కేసులు పెట్టించారు.. తాము మహబూబ్ నగర్ వస్తే ‘నీ వీపు చింతపండు అవుతుంది’ జాగ్రత్త అని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు.

రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌కు తన నాయకత్వంపై నమ్మకముంటే.. మళ్లీ గజ్వేల్ నుంచే పోటీ చేయాలి.. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలని సవాల్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 కు 14 సీట్లు గెలిపించండి.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...