ట్విట్టర్‌ను పబ్లిసిటీ కోసం, అటెన్షన్ కోసం ఆర్జీవీ వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఓ సినీ డైరెక్టర్ ఒక సినిమా రంగంలోని వాటిపైనే స్పందించాలని లేదు.. 24 ఫ్రేమ్స్‌లా అన్ని విషయాల్లోనూ తలదూర్చుతాను అన్నట్లు ఉంటుంది ఆర్జీవీ వ్యవహారం. రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను అనే రామ్‌గోపాల్ వర్మ.. తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ పేరు మార్పుపై స్పందించారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యారంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్‌కు స్వాగతం అంటూ ట్విట్టర్ వేదికగా వెల్కమ్ చెప్పారు. కాగా కేసీఆర్‌ను ఆదిపురుష్‌గా అభివర్ణిస్తూ ఆర్జీవి చేసిన ట్వీట్‌ను చూసి నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పొగడ్తా.. లేదా విమర్శా అంటూ రీట్వీట్‌లు చేస్తున్నారు. ఇంతకీ మీరేమి అనుకుంటున్నారు ఆర్జీవీ పొగిడారా.. విమర్శించారా?