తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

-

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి 23 మంది నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్‌లో తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌కు చెందిన 17 మంది అభ్యర్థుల్లో 12 మంది ఆస్తులు రూ.10 కోట్లకు పైగా ఉన్నాయి. బీజేపీలో 13 మంది, బీఆర్ఎస్‌లో 10 మంది ఆస్తుల విలువ రూ.10 కోట్లు దాటాయి. ప్రధాన పార్టీల్లో అత్యంత తక్కువ ఆస్తులున్న అభ్యర్థిగా నాగర్‌కర్నూల్‌కు చెందిన భరత్‌ప్రసాద్‌ నిలిచారు. ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ రూ.33.85 లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్య రూ.1.55 కోట్లు), నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ రూ.1.41కోట్లు, వరంగల్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ రూ.1.12 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు.

టాప్ 10 ధనవంతుల జాబితా..

విశ్వేశ్శర్ రెడ్డి ( BJP)- రూ.4,568 కోట్లు
రంజిత్ రెడ్డి (CON) – రూ.435 కోట్లు
కాసాని జ్ఞానేశ్వర్ (BRS)- రూ.228 కోట్లు
మాధవీలత (BJP)- రూ. 221 కోట్లు
నామా నాగేశ్వర్ రావు (BRS)- రూ. 155 కోట్లు
బీబీ పాటిల్ (BJP)- రూ. 151 కోట్లు
క్యామ మల్లేష్ ( BRS)- రూ. 145 కోట్లు
ధర్మపురి అర్వింద్ (BJP)- రూ. 109 కోట్లు
కంచర్ల కృష్ణారెడ్డి (BRS)- రూ. 83 కోట్లు
గాలి అనిల్ కుమార్ (BRS)- రూ. 82 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...