Betting Apps Case | ‘విష్ణుప్రియ, టేస్టీ తేజ భయటపడ్డారు’

-

Betting Apps Case | బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, నటీనటులపై తెలంగాణ పోలీసు శాఖ కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందులో మరికొందరి పేర్లను కూడా చేరుస్తోంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌ల ద్వారా యువతకు కీడు జరుతుందని తెలిసినా.. ఎందుకు వాటిని ప్రమోట్ చేస్తున్నారని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కేసు నమోదు చేసిన యూట్యూబర్లు, ఇన్‌ఫ్ల్యూయెన్లర్లు, నటీనటులను విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, పోలీసుల విచారణకు నటి విష్ణుప్రియ, టేస్టీ తేజ డుమ్మా కొట్టారు. కాగా వారు గౌర్హాజరు కావడంపై బిగ్‌బాస్ ఫేమ్ ఆర్‌జే శేఖర్ బాషా(RJ Shekar Basha) కీలక వ్యాఖ్యలు చేశాడు.

- Advertisement -

Betting Apps Case | ప్రస్తుతం విష్ణుప్రియ(Vishnu Priya), టేస్టీ తేజ(Tasty Teja) షాక్‌లో ఉన్నారని అన్నాడు. కేసుపై భయంతోనే వారు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారని, మూడురోజుల తర్వాత హాజరవడానికి అనుమతికోరారని తెలిపారు. వారి అభ్యర్థనను పోలీసులు అంగీకరించారని కూడా తెలిపాడు. ఇక నుంచి లీగల్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, వేటికయినా ప్రచారం చేయకూడదని బిగ్‌బాస్ గ్రూప్ సభ్యులమంతా నిర్ణయించుకున్నట్లు కూడా వెల్లడించాడు.

Read Also: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి దబిడి దిబిడే.. TG పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us on : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Telangana Budget 2025 | తెంలగాణ బడ్జెట్ కేటాయింపులిలా

Telangana Budget 2025 | తెలంగాణ అసెంబ్లీదలో రాష్ట్ర ఆర్థిక మంత్రి...

Donald Trump | పుతిన్‌కు ట్రంప్ ఫోన్.. యుద్ధం గురించి మాట్లాడటానికే..!

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాగా అమెరికా అధ్యక్ష...