లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఊరట దక్కలేదు. ఆమె దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈనెల 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ జరుపుతామని వెల్లడించింది.
మరోవైపు కవిత(MLC Kavitha) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ(ED) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజులు ఈడీ కస్టడీలో విచారించగా.. అనంతరం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న కవితను తీహార్ జైలుకు తరలించారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్టై తిహార్ జైలులో ఉన్న విషయం విధితమే.