కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంపై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పందించారు. ఈ స్కీమ్ వల్ల ఆర్టీసీకి, ఆటో డ్రైవర్లకు ఆందోళన కలుగుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అందులో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని(Mahalakshmi Scheme) సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ పథకంలో భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ స్కీంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుందని కొందరు, మా పొట్ట కూటి కొడుతున్నారు అంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మీ పథకం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు.
RS Praveen Kumar | ఇప్పుడిప్పుడే నష్టాల్లోనుండి బయటికొస్తున్న ఆర్టీసీ(TSRTC) మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెను భారాన్ని మోపబోతున్నది. ఇది దాదాపుగా 50 వేల మంది ఆర్టీసి కార్మికుల జీవితాల మీద కూడా ప్రభావం చూపబోతున్నది. అంతే కాకుండా చాలా గ్రామాలకు ఆర్టీసి బస్సులు తెలంగాణ వచ్చినప్పటినుండి రకరకాల కారణాల వల్ల బందుపెట్టిండ్రు. ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసులను పునరుద్దరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది! అదే విధంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తమకు తగినంత ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడతామేమోనని భయపడుతున్నారు! ఊర్లల్లో తగిన పని దొరక్క పట్నాలకు వలస వచ్చి రేకుల షెడ్లలో ఉంటూ కిరాయి ఆటోలను నడుపుతూ పొట్టగడుపుకుంటున్న ఆటో డ్రైవరు సోదరులను ప్రభుత్వమే ఆదుకోవాలి” అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టును పెట్టారు.
ఇప్పుడిప్పుడే నష్టాల్లోనుండి బయటికొస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెను భారాన్ని మోపబోతున్నది. ఇది దాదాపుగా 50 వేల మంది ఆర్టీసి కార్మికుల జీవితాల మీద కూడా ప్రభావం చూపబోతున్నది. అంతే కాకుండా చాలా గ్రామాలకు ఆర్టీసి బస్సులు తెలంగాణ వచ్చినప్పటినుండి రకరకాల కారణాల…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 10, 2023