తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్ల బిల్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడుతుండగా.. తాజాగా బీఎస్‌పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పందించారు. ఈ సందర్భంగా అమిత్ షా(Amit Shah) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా.. మైనార్టీ రిజర్వేషన్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఖండించారు. కనీస అవగాహన లేకుండా ఓ కేంద్రమంత్రి హోదాలో ఉండి రిజర్వేషన్లపై ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. అమిత్ షా వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. అంతేగాక, ఆర్టిజన్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులను బానిసలుగా చూస్తోందన్న ఆయన.. రిటైర్డ్ ఎంప్లాయిస్‌ను సీఎండీలుగా పెట్టుకుని ఆటలాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: కేసీఆర్‌పై గవర్నర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter