RS Praveen Kumar | గొడ్డు చాకిరీ చేసినా పోలీసులపై కేసీఆర్‌కు కనికరం కలగడం లేదు

-

ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌పై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘నేటి వరకు తెలంగాణలో పోలీసులకు మరియు ఇతర ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు. PRC అరియర్లు కేవలం రెండే ఇచ్చారు. మూడు సరెండర్ లీవులు ఇంకా పెండింగులో ఉన్నాయి. లోన్లు తీసుకున్న వాళ్లు ఈఎమ్‌ఐలు కట్టలేక సిబిల్ రేటింగులు పడిపోతున్నాయి. పిల్లల ఫీజులు సకాలంలో కట్టనందుకు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను అవమానిస్తూ పుస్తకాలివ్వకుండా వెనక్కు పంపిస్తున్నారు.

- Advertisement -

ఇంక ఇళ్ల కిరాయి గురించి అయితే చెప్పనక్కరలేదు. ఆరోగ్య భద్రత అనారోగ్యంతో మంచాన పడ్డది. ముఖ్యమంత్రి అసత్యాల-భ్రమల సభలన్నింటికీ బలవంతంగా బందోబస్తు వేసి, మా లాంటి ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ అక్రమంగా రాత్రికి రాత్రే అరెస్టు చేయిస్తున్నరు. ఫాం హౌసుల లాంటి ప్రైవేటు ఆస్తులకు కూడా బలవంతంగా వందల మంది పోలీసు కమాండోలను బందోబస్తుకు అక్రమంగా వినియోగిస్తున్నరు. ఈ బందోబస్తుల టీఏలు ఏవీ ఇంతవరకు రావడం లేదు.

ఇంత గొడ్డు చాకిరీ చేసినా పోలీసులు, హోంగార్డుల మీద కనికరం కలగడం లేదు సీఎం గారికి. ఇందుకోసమేనా కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ త్యాగం చేసింది? మన సకల జనుల సమ్మెలు ఈలాంటి హృదయం లేని పాలకుల కోసమే చేసినమా?? ఎక్కడ పోయిండ్రు పాలాభిషేక యూనియన్ సోదరులు? పాలకులు MLC పదవుల ఆశ చూపి మీ నోళ్లు కట్టేశారా?? పోలీసన్నలారా, ఉద్యోగ మిత్రులారా, మన బహుజనరాజ్యంలో మిమ్ముల కంటికి రెప్పలా కాపాడుకుంటం.’’ అని పోలీసులు, ఉద్యోగులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) హామీ ఇచ్చారు.

Read Also: సీతక్కను ముఖ్యమంత్రి చేస్తాం: రేవంత్ రెడ్డి

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...