RS Praveen Kumar |డిమాండ్ల సాధనకై నిరవధిక సమ్మెకు సిద్దమైన తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు సర్కార్ ఝలక్ ఇచ్చాయి. సమ్మెకు దిగితే అదే రోజు ఉద్యోగాల్లోంచి తొలగించాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 25వ తేది నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఇప్పటికే ఆర్టిజన్ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో ప్రభుత్వం వాళ్ల ఆందోళనకు ఉద్యోగాలతో లింకు పెడుతూ ఆందోళనకు దిగితే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామంటూ ఊహించని షాక్ ఇచ్చింది.
తాజాగా.. ఉద్యోగుల సమ్మెకు బీఎస్‌పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. నిజానికి ఈ 23,000 మంది కార్మికులు రాత్రింబవళ్లు పని చేయడం వల్లనే సంస్థలు నడుస్తున్నవి. 1948 నాటి చట్టాల ప్రకారం వీళ్లకు జీతం ఇస్తే ఎట్ల? వాళ్లడుగుతున్నది కేవలం పేస్కేలు, ఉద్యోగ భద్రతనే కదా!’ అని సర్కార్‌పై అసహనం వ్యక్తం చేశారు.
Read Also: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత
Follow us on: Google News, Koo, Twitter