సాయిచంద్ భార్యకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి

-

ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. సాయిచంద్ మృతితో బీఆర్ఎస్ నేతలతో పాటు యావత్ కళాకారుల బృందం మొత్తం విషాదంలో మునిగిపోయింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట ఉంటూ.. పార్టీలో చురుగ్గా పాల్గొని అందరి మన్ననలు పొందిన సాయి.. ఆకస్మిక మృతి అందరినీ కంటతడి పెట్టించింది. దీంతో సాయిచంద్ భార్య రజనీ(Saichand Wife Rajini)కి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(Telangana State Warehousing Corporation) చైర్మన్‌గా రజినీని నియమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే కుసుమ జగదీష్, సాయి చంద్ కుటుంబాలకు మంత్రులు తమ ఒక నెల జీతం మూడు కోట్ల రూపాయలను జగదీష్, సాయి చంద్ కుటుంబాలకు అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

- Advertisement -
Read Also: ఫలక్ నుమా రైలు ప్రమాదం.. వేల ప్రాణాలు కాపాడిన ‘ఆ ఒక్కడు’

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Maha Kumbh Mela | భక్తులకు అలర్ట్.. మహాకుంభమేళా కోసం ప్రత్యేక వెబ్ పేజ్

మహా కుంభమేళాకు(Maha Kumbh Mela) ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతోంది. ఉత్తర్ ప్రదేశ్...

Tirumala | తిరుమలలో విమానం కలకలం

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది....