రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన(Pranay Murder Case) ప్రజల కళ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉంది. ఈ కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మిగిలిన వారికి జీవితఖైదు విధించింది. ప్రణయ్, అమృత ఘటన ప్రతి ఒక్కరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మరోసారి కీలకంగా మారింది. ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1 గా ఉన్నారు. ఏ2గా సుభాష్ కుమార్, ఏ3గా అస్గర్‌అలీ, ఏ4గా బారీ, ఏ5గా కరీం, ఏ6గా శ్రవణ్ కుమార్, ఏ7గా శివ, ఏ8గా నిజాం ఉన్నారు. వీరిలో ఏ2 సుభాష్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం.
Pranay Murder Case | మిగిలిన నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం వెలువరించింది. 302, 120బ్ IPC, 109, 1989 సెక్షన్ IPC ఇండియన్, ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష వేయడం జరిగింది. కాగా, తమ శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు నేరస్థులు. హార్ట్ పెషేంట్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, చిన్న పిల్లలు అని చెబుతున్నారు కొందరు నేరస్థులు. మరి వారి అభ్యర్థనల విషయంలో కోర్టు ఏం చేస్తుందో చూడాలి.