విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

-

తెలంగాణ ఎన్నికల సందర్భంగా బుధవారం, గురువారం హైదరాబాద్‌(Hyderabad)లోని విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. నవంబర్‌ 30న పోలింగ్ సందర్భంగా నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 1న యదావిధిగా విద్యాసంస్థలు నడవనున్నాయని వెల్లడించారు. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు.

- Advertisement -

మరోవైపు పోలింగ్ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు ఈనెల 30న వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర కార్మికశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కార్మికశాఖ స్పెషల్ సెక్రటరీ.రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...