బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎమ్మెల్యేలు వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ(Arekapudi Gandhi) ఆ పార్టీని వీడారు. శనివారం ఆయన జూబిలీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ఆయనకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అరికపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
బీఆర్ఎస్ కి తొమ్మిదిమంది గుడ్ బై..
ఈరోజు కాంగ్రెస్ లో జాయిన్ అయిన అరికపూడి గాంధీతో కలిపి మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్(BRS) కి గుడ్ బై చెప్పారు. వీరంతా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం రాత్రి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరగా.. ఈరోజు అరికపూడి గాంధీ(Arekapudi Gandhi) కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.