నాంపల్లి ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో వేల మంది పాల్గొన్నారు. కాగా ఈ ఎగ్జిబిషన్‌పై షీటీమ్స్(She Teams) స్పెషల్ ఫోకస్ పెట్టాయి. వినోదం పేరిట మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారి ఆటకట్టించాలని ఎక్కడిక్కడ ఏర్పాటు చేశారు అధికారులు. వీటి ఆధారంగా ఈ ఎగ్జిబిషన్‌లో(Numaish) మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అదుపులోకి కూడా తీసుకున్నారు. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరిగిన నుమాయిష్‌లో మొత్తంగా 247 మంది పురుషులను షీటీమ్ అదుపులోకి తీసుకుంది.
37 కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వీరిని షీటీమ్స్(She Teams) అరెస్ట్ చేసింది. వీరిలో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష, 33 మందికి రూ.1,050 చొప్పున జరిమానా విధించారు. 190 మందిని హెచ్చరించి వదిలిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాగా వీరిలో 24 మంది మైనర్లు కాగా 223 మంది మేజర్లేనని అధికారులు తేల్చారు. ప్రస్తుతం మరో 20 కేసులు విచారణ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు.