పండుగపూట తీవ్ర విషాదం.. అన్న శవానికి రాఖీ కట్టిన చెల్లెలు

-

Peddapalli | రాఖీ పండుగ ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నాదమ్ముల అనుబంధాన్ని ఈ పండుగ కళ్లకు కట్టేలా చూపుతుంది. ఈ విశ్వంలో అన్నాచెళ్లెలు ఎక్కడ స్థిరపడ్డా.. రాఖీ పండుగ రోజున వెతుక్కుంటూ వచ్చి మరీ రాఖీ కడుతుంటారు. అది ఈ పండుగకున్న విశిష్టత. అయితే.. ఈ పండుగ వేళ మాటలకు అందని విషాదం చోటుచేసుకుంది. పండుగపూట అన్న మరణవార్త విన్న చెల్లెలి గుండె బద్దలైంది. దు:ఖాన్ని ఆపుకోలేక అన్న శవానికి రాఖీ కట్టి అందరిచేత కంటనీరు తెప్పించింది.

- Advertisement -

ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కనుకయ్య సోమవారం గుండెపోటుతో మరణించాడు. అతని అంత్యక్రియలను మంగళవారం నిర్వహించాల్సి ఉంది. రాఖీ పండుగకు ఒక్క రోజు ముందే తన అన్న మరణించడంతో అతని చెల్లెలు గౌరమ్మ ఎంతగానో కుమిలిపోయింది. సోదరుడి మృతదేహానికి చివరిసారిగా రాఖీ కట్టి తన పేగుబంధాన్ని చాటుకుంది. గౌరమ్మ రోదన చూసిన వాళ్లందరినీ దుఃఖ సాగరంలో ముంచేసింది.

Read Also: సీటు వదిలేయడానికి సిద్ధం.. ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...