క్రికెట్ ఆడుతూ గుండెపోటు(Heart Attack)తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్టుపల్లిలోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా(Prakasam District) మద్దిపాడు మండలం మల్లవరానికి చెందిన మణికంఠ హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నారు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. శనివారం వారాంతం కావడంతో క్రికెట్ ఆడేందుకు ఘట్టుపల్లి కేసీఆర్ క్రికెట్ స్టేడియానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆయనకు వెన్ను నొప్పి వచ్చింది. దాంతో ఆయన మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయారు.
Heart Attack |అనంతరం స్టేడియం బయట తన కారులో పడుకున్నారు. మ్యాచ్ అయిన తర్వాత స్నేహితులు వెళ్లే సరికి మణికంఠను నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ఎంతకీ పలకకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మణికంఠ చనిపోయాడని వైద్యులు తెలిపారు. మణికంఠ సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. మణికంఠ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఒక మావోయిస్టు హతం
Follow us on: Google News, Koo, Twitter