ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ సోమేశ్ కుమార్(Somesh Kumar) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్‌లో అర్చకులు పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమేష్ కుమార్‌కు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు కేసీఆర్(KCR)కు సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విభజనచట్టంలో భాగంగా ఏపీ క్యాడర్‌కు వెళ్లిపోయిన సోమేష్ కుమార్(Somesh Kumar).. స్టే ఆర్డర్‌తో తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత పలు పోస్టుల్లో పని చేసిన సోమేష్.. సీఎస్‌గా కూడా పని చేశారు. ఫైనల్‌గా హైకోర్టు క్యాట్ ఆర్డర్స్‌ను కొట్టివేయడంతో ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం సోమేష్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే.. కొద్ది రోజుల్లోనే వీఆర్‌ఎస్ తీసుకొని సర్వీస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక సలహాదారునిగా నియమితులయ్యారు.
Read Also: సోమేష్ కుమార్‌కు పదవిపై షర్మిల పరోక్ష విమర్శలు
Follow us on: Google News, Koo, Twitter