కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం పంపారు. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు.
‘‘నమస్కారం ప్రియమైన నా తెలంగాణ సోదరీ, సోదరులారా.. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా కానీ, మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ తల్లి.. అమరుల పుత్రుల కల నెరవేరేలా చూడాలి. మనమందరం దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నన్ను సోనియమ్మా అని పిలిచి అపారమైన గౌరవం, అప్యాయత ఇచ్చారు. నన్ను తల్లిలా చూసుకున్నారు. ఈ ప్రేమ, గౌరవానికి నేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞుతగా ఉంటాను. తెలంగాణలోని మన సోదరీమణులు, తల్లులు, కొడుకులు, కుమార్తెలు, సోదరులు ఈసారి మార్ప కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి’’ అని సోనియా(Sonia Gandhi) విజ్ఞప్తి చేశారు.
"దొరల తెలంగాణ పోవాలి, ప్రజల తెలంగాణ రావాలి.
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి."తెలంగాణ ప్రజలకు తల్లి సోనియమ్మ సందేశం. pic.twitter.com/UY93jCEBMF
— Telangana Congress (@INCTelangana) November 28, 2023