కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఎవరూ ఆనందంగా లేరని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారని అన్నారు. పాడి రైతులకు నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు. పాడి రైతులకు నాలుగు నెలల బకాయిలు పక్షం రోజుల్లో చెల్లించాలని డిమాండ్ చేశారు.
బకాయిలు చెల్లించకపోతే పాడి రైతులతో కలిసి ఉద్యమానికి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లో వాడే 30 లక్షల లీటర్ల పాలలో తెలంగాణ వాటా 5 లక్షల లీటర్లు అని అన్నారు. రాష్ట్ర పాడి రైతుల నుంచి సేకరించే రూ.5 లక్షల లీటర్లలోనూ కోతకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. విజయ డెయిరీలో రూ.500 కోట్ల మేర పాడి ఉత్పత్తులు ఉన్నాయని Srinivas Goud అన్నారు.