Nizamabad |తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు(Inter Results) మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. పరీక్షా ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికి మనస్థాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.
నిజామాబాద్(Nizamabad) జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రజ్వల్ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాడు. ఈరోజు పరీక్ష ఫలితాలు రావడంతో తన రిజల్ట్స్ చూసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురైన ప్రజ్వల్.. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రజ్వల్ తల్లిదండ్రుల ఆవేదన చూసి చుట్టుప్రక్కల వారు కూడా కన్నీరు పెడుతున్నారు.
Read Also: జూనియర్ పంచాయతీ సెక్రెటరీల సమ్మె.. సీఎంకి రేవంత్ బహిరంగ లేఖ
Follow us on: Google News, Koo, Twitter