Students suicide attempt at Arepalli kasthuribha bc hostel: వారందరూ పదో తరగతి చదువుతూ, వసతి గృహంలో ఉంటున్నారు. అయితే కొందరి మధ్య చెలరేగిన గొడవ తీవ్ర వివాదంగా మారింది. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థులు హాస్టల్‌లో ఉన్న శానిటైజర్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన హనుమకొండలోని ఆరెపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆరెపల్లి కస్తూర్బా గాంధీ బీసీ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్నారు.
వారిలో కొందరు విద్యార్థులు ఓ విషయంలో ఘర్షణకు దిగారు. దీంతో అందులోని ఐదుగురు విద్యార్థినులు మనస్థాపంతో వసతి గృహంలో ఉన్న శానిటైజర్‌ను తాగి, ఆత్మహత్యాయత్నానికి (Students suicide attempt) పాల్పడ్డారు. దీంతో ఇది గమనించిన తోటి విద్యార్థిలు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిని విద్యార్థులను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యలు పేర్కొన్నారు. ఏ విషయంపై వివాదం చెలరేగిందో అన్న అంశంపై విచారణ చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.