తెలంగాణ హైకోర్టు(TS High Court)కు వేసవి సెలవులు ప్రకటించారు. మే ఒకటో తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు న్యాయస్థానానికి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం రావడంతో రేపటి నుంచే సెలవులు ఉండనున్నాయి. దీంతో ఇవాళ ఒక్కరోజే కోర్టు నడవనుంది. వరుస సెలవుల నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణకు మాత్రం ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటుచేశారు. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ఈ బెంచ్ లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ వెల్లడించారు. అంటే హెబియస్ కార్పస్ పిటిషన్లు, ముందస్తు బెయిల్, బెయిల్ పిటిషన్లు, బెయిల్ తిరస్కరణపై అప్పీల్ ఇతర ఎమర్జెన్సీ కేసులను మాత్రమే వెకేషన్ కోర్టులు విచారిస్తాయి.
Read Also: ‘సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలి’
Follow us on: Google News, Koo, Twitter