తెలుగు ప్రశ్నపత్రం స్థానంలో హిందీ ప్రశ్నపత్రాన్ని పంపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, కస్టోడియన్ అధికారిని సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ లోని పదవ తరగతి పరీక్ష కేంద్రంలో తెలుగు ప్రశ్నపత్రం బదులుగా అధికారులు హిందీ ప్రశ్నపత్రం విద్యార్థులకు ఇచ్చారు. దీంతో పరీక్షలకు హాజరైన 240 మంది విద్యార్థులు 2 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనలో వారి పాత్రకు సంబంధించి సూపరింటెండెంట్ అలీ, కస్టోడియన్ అధికారి పద్మజను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
Mancherial | పరీక్ష ప్రారంభం అవగానే హిందీ భాషా ప్రశ్నపత్రాన్ని చూసి షాక్ అయిన అధికారులు, దానిని పోలీస్ స్టేషన్‌కు తిరిగి పంపించారు. తర్వాత తెలుగు భాషా ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అందజేశారు. దీంతో ఆ సెంటర్ లో పరీక్ష ఉదయం 9.30 గంటలకు కాకుండా ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగింది. ఈ తప్పుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DEOని ఆదేశించారు.