ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను పోలీసులు అదుపులోకి తీసుకుని తీహార్ జైలు(Tihar Jail)లో ఉంచారు. అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచి బెయిల్ కోసం కవిత ఎంతో కష్టపడుతున్నారు. కాగా ఈరోజు ఈడీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇరు వర్గాలు వాదనలు విన్న తర్వాత కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కవిత(MLC Kavitha) బెయిల్ పోరాటం ఇంతటితో ముగిసిందని చెప్పలేకున్నాం. సీబీఐ కేసులో కూడా బెయిల్ మంజూరయితేనే కవిత.. విడుదల అవుతారు. అప్పటి వరకు ఈడీ కేసులో బెయిల్ వచ్చినా ఆమె తీహార్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 16న ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేసి.. ఆమెను వెంటనే అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. మరుసటి రోజే ఆమెను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించి అటునుంచి అటు తీహార్ జైలుకు తరలించారు.