తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి, హై కోర్టు రిజిస్ట్రార్ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 22 కల్ల నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించిన సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy), కేటీఆర్(KTR) పిటిషన్లపై ఇరు వర్గాలు వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
Supreme Court | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు నోటీసులు
-