Supreme court Reluctance Interfere Trs Mlas case: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాగా ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం (Supreme court) విముఖత చూపింది. కాగా.. నిందితుడు రామచంద్ర భారతి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ దశలో ఉందని.. జోక్యం చేసుకోలేమని జస్టిస్ గవాయి అన్నారు. కావాలంటే రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించవచ్చని ఆ హక్కు పిటిషనర్‌కు ఉందని సూచించారు. హైకోర్టు బెయిల్ ఇస్తుంది కదా అని వ్యాఖ్యానించారు.
- Advertisement -