కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు తెలంగాణ దేశ భూభాగంలో ఉంది అన్న సంతగి ప్రధానమంత్రి మర్చిపోయారా? అని ఎద్దేవా చేశారు. సింగరేణి మీద ప్రధాని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ(Modi) చెప్పలేదా? అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గానే వ్యవహరించిందని తెలిపారు. ఈ కేసులో అనేక మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ(BJP) నేతలు చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. మా ముఖ్యమంత్రి సింపుల్‌గా వుంటారు.. సింపుల్‌గా పని చేస్తారని తలసాని(Talasani Srinivas Yadav) వెల్లడించారు. ప్రధాని మోడీ మాదిరి ఖరీదైన బట్టలు వేసుకోరని గుర్తు చేశారు.
Read Also: బడ్డీ కొట్టు వ్యాపారికి రూ.12కోట్లు చెల్లించాలని ఐటీ నోటీసులు
Follow us on: Google News, Koo, Twitter