బీఆర్ఎస్‌తో పొత్తుపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం తిప్పికొడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి గద్దెదించడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు.
బీజేపీ మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ శక్తులను వ్యతిరేకిద్దాం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పోరాడుదామనే సంకల్పంతో సీపీఎం ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర చేపట్టినట్లు తెలిపారు. బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు మద్దతు కొనసాగిస్తామని, సీఎం కేసీఆర్(KCR) సూచనలతో ముందుకు సాగుతామన్నారు. భవిష్యత్తులో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని బలమైన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తమ్మినేని(Tammineni Veerabhadram) చెప్పారు.
Read Also: కొత్త జీవితం ప్రారంభించా.. మీ సపోర్ట్ నాకు కావాలి: మంచు మనోజ్
Follow us on: Google News, Koo, Twitter