Tarun Chug: ప్రజాస్వామ్యం, అహింస మార్గంలోనే కేసీఆర్‌ను ఎదుర్కొంటాం

0
Tarun Chug

Tarun Chug fires on Telangan Govt and CM Kcr: రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణాలో పావులు కదుపుతున్నారు కమలనాథులు. ఈ నేపథ్యంలోనే మూడు రోజులపాటు తెలంగాణలో బీజేపీ శిక్షణ తరగతులను ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ ఈ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ తరగతుల్లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలందరూ పాల్గొంటారని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో పలు అంశాలపై చర్చిస్తామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తరుణ్‌ చుగ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ అహంకారం, హింసా ప్రవృత్తిగా మారిందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై దాడి చేయటం దుర్మార్గమని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్య, అహింసా మార్గంలోనే ఎదుర్కొంటామని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై స్పందించిన తరుణ్‌ చుగ్‌, ఆ ఫాంహౌస్‌ ఎపిసోడ్‌ అంతా కేసీఆర్‌ డ్రామా అంటూ తరుణ్‌చుగ్‌ (Tarun Chug) ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here