మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవుడు కనిష్క్‌రెడ్డి(19) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గురువారం రాత్రి గొల్లపల్లి కలాన్ దగ్గర ఓఆర్ఆర్‌పై కనిష్క్ డ్రైవింగ్ చేస్తున్న కారు.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనిష్క్ తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన యశోధ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. అతడి మృతితో తీగల కృష్ణారెడ్డి కుటుంబంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Teegala Krishna Reddy | ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ మేయర్ మనవడు మృతి
-
