Telangana: 13 మంది IAS, IPS ల వివాదం పై నేడు కీలక పరిణామం

-

Telangana: తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సహా 13 మంది అధికారుల క్యాడర్ కేటాయింపు పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ క్యాడర్ ను రద్దు చేస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. మరో 13 మంది ఐఏఎస్, ఐపీఎస్ ల వివాదంపై విచారణ చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపును సవాలు చేస్తూ గతంలో వీరంతా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆ అధికారులకు 2016లో అనుకూలంగా తీర్పునిచ్చింది. 2017 లో కేంద్రం పరిధిలోని డీవోపీటీ ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసింది. ఇటీవల సోమేశ్ కుమార్ పై తీర్పునిచ్చిన హైకోర్టు.. మిగతా 13 మంది అధికారులపై నేటి విచారణ జాబితాలో ప్రస్తావించింది. అయితే తీర్పునిస్తారా ఇంకా వాదనలు కొనసాగిస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
Read Also:

ధనలక్ష్మి ఇంట్లోకి రావాలంటే గుమ్మం వద్ద ఈ నియమాలు పాటించండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...