HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) ను కలిశారు. కంచె గచ్చిబౌలి వద్ద ఉన్న 400 ఎకరాల భూమిని రక్షించాలని, భూమి వేలం నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరం అని ఎంపీల బృందం కేంద్రమంత్రికి వివరించారు.
HCU Land Issue | 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని తెలియజేశారు. అలాంటి భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. HCU విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ కి తెలిపారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు ఆయనకి విజ్ఞప్తి చేశారు.
ప్రియాంక గాంధీ భర్త కోసమే…
గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూముల వేలంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి HCU భూమిని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన పదవి కాపాడుకోవడానికి, సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందడానికి రూ.40 వేల కోట్ల భూమిని కేవలం రూ.20 వేల కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నాడన్నారు.
Read Also: RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం
Follow Us : Google News, Twitter, Share Chat