శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం కొనసాగుతోంది. 22 అంశాల అజెండాతో తెలంగాణ క్యాబినెట్ ప్రారంభమైంది. ఇప్పటికే భేటీ ప్రారంభమై 2 గంటలు దాటింది. ఇప్పటి వరకు పలు కీలక అంశాలపై క్యాబినెట్ నిరయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 11 కొత్త మండలాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 200 కొత్త గ్రామపంచాయతీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి చాలా మంది కొత్త రేషన్ కార్డుల(Ration Cards) కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులపైనా సర్కార్ తీపి కబురు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా అమలుపై ప్రధానంగా చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాకి సంబంధించిన నివేదికను క్యాబినెట్(Telangana Cabinet) ముందుంచింది.