ఎస్సీ వర్గీకరణపై(SC Classification) తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో వీలైనంత త్వరగా వర్గీకరణ అమలు చేసేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత రావడం కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించి నివేదిక అందుకుంది. నివేదిక ఆధారంగా ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో(Cabinet Meeting) ఈ ముసాయిదా బిల్లులపై కూడా కీలకంగా చర్చ జరిగింది. ఇందులో మంత్రులు కొన్ని సవరణలు చెప్పారని సమాచారం. కాగా మొత్తానికి ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్ర వర్గం ఆమోదం తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా తుది మెరుగులు దిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు.