Telangana Cabinet | తెలంగాణ తల్లి, రాష్ట్ర గేయం.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు

-

Telangana Cabinet | సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు, మరో రెండు గ్యారెంటీల అమలు, రాష్ట్ర గేయం, తెలంగాణ తల్లి ప్రతిరూపం, తెలంగాణ చిహ్నం ఇంకా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

- Advertisement -

Telangana Cabinet Decisions :

శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర కేబినేట్లో నిర్ణయం తీసుకున్నారు.

సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు.

తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

మరో రెండు గ్యారంటీల హామీల అమలుపై కేబినేట్ చర్చించింది.

రాచరికపు పునాదుల నుంచి త్యాగానికి పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ జీవన విధానాన్ని, కళారూపాలను పునరుజ్జీవింపజేయాలని, తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పునర్నిర్వచించుకోవాలని కేబినేట్ తీర్మానం చేసింది.

అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చాలని తీర్మానించారు. రాజరిక పాలన గుర్తులు లేకుండా మన ప్రాంతం, ప్రజలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని పోరాటాలకు, త్యాగాల చిహ్నంగా రూపుదిద్దాలని నిర్ణయం జరిగింది. దీని కోసం కళాకారుల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లలో తెలంగాణ పేరును సూచించే ‘టీఎస్’ అక్షరాలను ఇకపై ‘టీజీ’గా మార్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ల చట్టంలో అందుకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది.

హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఖైదీలకు క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై కేబినేట్లో చర్చ జరిగింది. క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

కొడంగల్ ఏరియా డెవెలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ఉన్న అన్ని (65) ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను నిర్వహిస్తారు.

Read Also: నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై సీఎం కీలక ఆదేశాలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...

KTR | ఆటోవాలాగా మారిన కేటీఆర్.. ఎందుకోసమంటే..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. ఆటోవాలాగా మారారు. అసెంబ్లీకి...